పల్లవి: నింగిని విడిచా చినుకు
జారే పథాన
ఎగసి
పల్లవి
పాడెను మనసు
అణిగిన ఆశలు
రేగి
నవ్వే ఏటికి
మల్లె
అల్లరి
చేసెను వయసు
చరణం: పొంగిన హృదయమే
చినుకుకు
స్వరమై
చిటపట పాటలే
పుడమికి
సర్వమై
సాగేటి
రాగాల హేలలో
వినిపించు
ఆనంద రవళిలో
తనువే
విరిసే బృందావనిలా
మనసే ఆడెను
మందాకినిలా
చరణం: అనుభవ సాగరం
అయ్యే మానసం
గురుతుల
విల్లులే
రాసెను
చినుకులే
గాంధర్వ
గానాల మధురిమతో
మన్నింటి
మత్తైన పిలుపులతో
ముంగిలికొచ్చే
మయూరాంగనై
చేతననిచ్చే
జీవనాదమే
చరణం:
తెమ్మెర పిలుపులే
రమ్మని
లేఖలై
తలుపుల
వెనకాల
తలపులు
పూయించె
మురిపాల
మువ్వలా సవ్వడితో
ఊరేగే
పరువాల పల్లకిలో
మనసే తనుగా
మందహాసాన
మరులే
కురిసే నందనవనాల.
******
******