శిద్దాని భావగీతాలు
Wednesday, 4 November 2015
శిద్దాని భావగీతాలు
పల్లవి : రెక్కలు తొడుగు రివురివ్వున ఎగురు
నింగికి లేదు నిన్నాపే జోరు
నీ గమ్యం నీవేనే నా మనసా
నీ తోడే నాకండా అది తెలుసా
చరణం: పున్నమి జాబిలిలా జగమంతా వెలిగించు
కమ్మని ఊహలతో కాలాన్నే పూయించు
అడుగుల నడవడితో అందరినీ పరికించు
ఆమని పలుకులతో దరహాసం వెలయించు
క్షణమాగని పయనంలోన
జనక్షేమం మతమంటూనే
మునుముందుకు సాగుతుపోవే నా మనసా ll రెక్కలు ll
చరణం : ఆగని పోరు సలుపు నీదేగా మరి గెలుపు
అలలకు గురువై నీవు అందని తీరం చేరు
విలువల వేణియపై సుమగీతం పలికించు
కిలకిల నవ్వులతో అనురాగం రవళించు
కనుజారే చుక్కలలోన
చెలరేగే భావనలెరిగి
ఎదఎదలో దివ్వెగ వెలిగే నా మనసా ll రెక్కలు ll
********
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)